జిల్లా కేంద్రంలో నూతనంగా శ్రీ వెంకటేశ్వరా షాపింగ్ మాల్‌ను సినీ తార వైష్ణవి చైతన్య, మిస్ ఎర్త్ వాటర్ ఇండియా ప్రీతి ముండె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇద్దరు ప్రముఖులు రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి మాల్‌ను అధికారికంగా ప్రారంభించారు.
జిల్లా కేంద్రంలో నూతనంగా శ్రీ వెంకటేశ్వరా షాపింగ్ మాల్‌ను సినీ తార వైష్ణవి చైతన్య, మిస్ ఎర్త్ వాటర్ ఇండియా ప్రీతి ముండె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇద్దరు ప్రముఖులు రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి మాల్‌ను అధికారికంగా ప్రారంభించారు. సినీ తార వైష్ణవి చైతన్య రాకతో మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. తమ అభిమాన తారను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా పాల్గొన్నారు.












