జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వరా షాపింగ్ మాల్ని సినీ తార వైష్ణవి చైతన్య, మిస్ ఎర్త్ వాటర్ ఇండియా ప్రీతి ముండె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వరా షాపింగ్ మాల్ని సినీ తార బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య, మిస్ ఎర్త్ వాటర్ ఇండియా ప్రీతి ముండె తో కలిసి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. సినీ తార వైష్ణవి చైతన్యను చూడటానికి అభిమానులు పెద్ద సంఖ్యలో ఎగబడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందడిగా జరిగింది.












