చెన్నూర్, 13 October
చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డుకు చెందిన రిజ్వాన్ యాక్సిడెంట్లో తలకు గాయమైంది. హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్సకు రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఈ విషయం మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి దృష్టికి వెళ్లగానే ఆయన స్పందించారు.
చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డుకు చెందిన రిజ్వాన్ యాక్సిడెంట్లో తలకు గాయమైంది. హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్సకు రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఈ విషయం మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి దృష్టికి వెళ్లగానే ఆయన స్పందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.7.50 లక్షల లోన్‌కు సంబంధించిన పత్రాన్ని ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి అందజేశారు. పేద కుటుంబానికి సహాయం చేసిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి ఆ కుటుంబం ధన్యవాదాలు తెలిపింది.












