క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక టెక్నాలజీని యశోదా హాస్పిటల్స్ - హైటెక్ సిటీ ప్రవేశపెట్టింది. ఈ టెక్నాలజీ ద్వారా రేడియేషన్ చికిత్సలో దుష్ప్రభావాలను తగ్గించి, కచ్చితత్వాన్ని పెంచడం సాధ్యమవుతుందని వైద్యులు తెలిపారు.
యశోదా హాస్పిటల్స్ - హైటెక్ సిటీలో రేడియేషన్ ఆంకాలజీ (, ) విభాగం వారు మాట్లాడుతూ, రేడియేషన్ చికిత్సలో ఒక కొత్త ఆవిష్కరణ. సాధారణంగా రేడియేషన్ థెరపీ తీసుకునే రోగులకు రేడియేషన్ వల్ల దుష్ప్రభావాలు వస్తాయా లేదా శరీరంలో ఏమైనా ఇబ్బందులు వస్తాయా అనే ప్రశ్నలు చాలా సాధారణంగా ఉంటాయి. అలాంటి ఆందోళనలను తగ్గించి, కచ్చితమైన మరియు సురక్షితమైన రేడియేషన్ చికిత్స అందించడానికి మేము అనే అత్యాధునిక టెక్నాలజీని యశోదా హాస్పిటల్స్ - హైటెక్ సిటీలో ప్రవేశపెట్టామని ఆయన వివరించారు.
హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లో ఉపయోగిస్తున్న సేవలు గురించి డాక్టర్ మణిదీప్ పెద్ది గారు మాట్లాడుతూ, ఇది అత్యాధునిక రేడియేషన్ యంత్రాలలో ఒకటి అని తెలిపారు. ఇందులో రెండు సాంకేతిక పరిజ్ఞానాలు - స్కాన్ మరియు లీనియర్ యాక్సిలేటర్ ()లు ఒకే యంత్రంలో పనిచేస్తాయి. దీని ప్రత్యేకత ఏమిటంటే, ప్రతిరోజు చికిత్స ప్రారంభం కాకముందే రోగికి ఆటోమెటిక్‌గా స్కాన్ జరుగుతుంది. దాంతో ఆ రోజు ట్యూమర్ యొక్క ఆకారం, సైజు, స్థానం వంటి వివరాలు స్పష్టంగా తెలుస్తాయి. దీని ఆధారంగా రేడియేషన్ కేవలం ట్యూమర్ ఉన్న ప్రాంతానికి మాత్రమే ఇవ్వబడుతుంది, పక్కన ఉన్న ఆరోగ్యకరమైన అవయవాలపై అతి తక్కువ ప్రభావం ఉంటుంది అని ఆయన వివరించారు.
దుష్ప్రభావాల నివారణ
డాక్టర్ మణిదీప్ పెద్ది గారు ఈ సందర్భంగా మరింత వివరంగా మాట్లాడుతూ.. సాధారణ రేడియేషన్ థెరపీలో రోగులకు తలనొప్పి, చర్మపు చికాకు, బలహీనత, వాంతులు, మూత్రంలో లేదా మలంలో రక్తం వంటి దుష్ప్రభావాలు రావచ్చునని, కాని టెక్నాలజీతో ఇవన్నీ చాలా వరకు నివారించవచ్చని, ఇది ప్రతిరోజు శరీరంలోని మార్పులను గుర్తించి చికిత్సను ఆ మేరకు సర్దుబాటు చేసే సామర్థ్యం కలిగిన యంత్రమని కుణ్ణంగా మీడియాకు వివరించారు.
వివిధ క్యాన్సర్లకు ప్రయోజనం
ప్రొస్టేట్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్, గర్భాశయం, గర్భాశయ ముఖద్వారం, బ్లాడర్, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్, బ్రెయిన్ ట్యూమర్లు వంటి కష్టమైన క్యాన్సర్లలో ఈ టెక్నాలజీ అద్భుతమైన ఫలితాలు ఇస్తోంది. ముఖ్యంగా బ్రెయిన్ ట్యూమర్లలో గైడెన్స్ వల్ల ట్యూమర్ స్పష్టంగా కనిపించడంతో, రేడియేషన్ ను మిల్లీమీటర్ స్థాయిలో ఇవ్వగలుగుతున్నామని అన్నారు.
తక్కువ కాలంలో ఫలితం
చికిత్స సమయం చాలా తక్కువ. కొన్ని సందర్భాల్లో కేవలం ఐదు రోజుల్లోనే పూర్తి చికిత్స పూర్తవుతుందని, ఇది రోగులకు మానసికంగా, శారీరకంగా కూడా పెద్ద ఉపశమనం ఇస్తుందని డాక్టర్ మణిదీప్ పెద్ది తెలిపారు.
యశోదా హాస్పిటల్స్‌లో దేశంలోనే తొలిసారిగా: ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదుగా లభించే ఈ టెక్నాలజీని యశోదా హాస్పిటల్స్ - హైటెక్ సిటీలో రెండు సంవత్సరాల క్రితం దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టాము. అప్పటి నుండి దేశీయ మరియు విదేశీ రోగులకు ఈ పద్ధతిలో అద్భుతమైన ఫలితాలు సాధించామని డాక్టర్ మణిదీప్ పెద్ది గారు తెలిపారు. అనేది రేడియేషన్ చికిత్సలో నిజమైన విప్లవాత్మక మార్పు. ఇది రోగులకు అత్యధిక భద్రత, అత్యల్ప దుష్ప్రభావాలు మరియు గరిష్ట కచ్చితత్వం అందించే సాంకేతిక అద్భుతం. ఇది రేడియేషన్ థెరపీలో కొత్త యుగానికి నాంది అని వివరించారు.












