భారతదేశంలో ప్రతి సంవత్సరం న జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఒక వ్యక్తి జీవితంలో రక్తం యొక్క అవశ్యకత మరియు ప్రాముఖ్యతను తెలియజేయడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం. ఇండియన్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అండ్ ఇమ్యూనోహెమటాలజీ ద్వారా 1975లో ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించింది.
భారతదేశంలో ప్రతి సంవత్సరం న జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఒక వ్యక్తి జీవితంలో రక్తం యొక్క అవశ్యకత మరియు ప్రాముఖ్యతను తెలియజేయడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం. ఇండియన్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అండ్ ఇమ్యూనోహెమటాలజీ ద్వారా 1975లో ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించింది.
రక్తమార్పిడి రంగంలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన నిపుణులు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, చండీగఢ్‌లో ఎమెరిటస్ ప్రొఫెసర్‌గా ఉన్న డాక్టర్ జై గోపాల్, భారతదేశంలో ప్రొఫెషనల్ దాతల నుండి రక్తం అమ్మకం మరియు కొనుగోలును నిషేధించే ప్రచారానికి నాయకత్వం వహించారు. ఆయన రక్తదాన దినోత్సవం పాటించడం ద్వారా రక్తదాన కార్యక్రమాల ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన కల్పించారు.
మంచిర్యాల జిల్లాలో రక్తదాన సేవలు
ఈ కార్యక్రమాన్ని మన దేశంలో 1975 సంవత్సరం నుండి వివిధ జిల్లా కేంద్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా లయన్ వి. మధుసూదన్ రెడ్డి, లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంస్థల ప్రతినిధిగా, రక్తదానం యొక్క ప్రాముఖ్యతలను తెలుపుతూ, దానిపై అవగాహన కల్పిస్తూ, గత కొన్ని సంవత్సరాలుగా వివిధ ప్రాంతాలలో వందలాది రక్తదాన శిబిరాలు నిర్వహించి, వేల యూనిట్ల స్వచ్ఛంద రక్తదానాన్ని సేకరిస్తున్నారు.
సేకరించిన ఈ రక్తదానాన్ని తలసేమియా మరియు సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు, ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు, ప్రమాదాలు సంభవించి అత్యవసర పరిస్థితిలో ఉన్నవారికి ఉపయోగపడేలా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తనిధి కేంద్రానికి సమకూరుస్తున్నారు. అంతేకాకుండా, స్వతహాగా అరుదైన ఏబీ నెగటివ్ (-) రక్తాన్ని దాదాపు 48 సార్లు ఇప్పటివరకు స్వచ్ఛందంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి అందించారు.
ప్రశంసలు మరియు అవార్డులు
లయన్ వి. మధుసూదన్ రెడ్డి చేసిన సేవలకు గాను పలుమార్లు జిల్లా కలెక్టర్ల ద్వారా, రాష్ట్ర గవర్నర్ గారి ద్వారా ప్రశంసా పత్రాలను, అవార్డులను స్వీకరించారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని, స్వచ్ఛందంగా రక్తదానం చేసిన రక్తదాతలను గుర్తించి, వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా శాలువాతో సత్కరించి, ప్రశంసా పత్రాలు మరియు రెండు సంవత్సరాల వ్యవధి గల లక్ష రూపాయల విలువైన ఉచిత ప్రమాద బీమా పాలసీలను అందజేస్తున్నారు.
ప్రజలకు రక్తదానంపై అవగాహన కల్పించడం కొరకు, పూర్తి సమాచారంతో కూడిన కరపత్రాలను జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా విడుదల చేసి, ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది.
మన దేశంలో ఇప్పటికీ మన అవసరాలకు సరిపడా రక్త యూనిట్లను సేకరించడంలో వెనుకబడి ఉన్నామని తెలియపరచడమైనది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇంకా రక్తదానంపై అవగాహన కల్పిస్తూ, అధిక సంఖ్యలో రక్తసేకరణ చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు తెలియపరుస్తున్నారు.












