జైపూర్ (అక్షరవేకువ) జూలై 14
జైపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాల్లో మంగళవారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో దట్టంగా పెరిగిన పిచ్చి మొక్కలు, పొదలను తొలగించారు. ప్రజలకు, రోగులకు పరిశుభ్రమైన వాతావరణం అందించడం తమ బాధ్యత అని సర్పంచ్ కూన భాస్కర్ పేర్కొన్నారు.
జైపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాల్లో మంగళవారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో పీహెచ్సీ ఆవరణ లోపల, వెలుపల దట్టంగా పెరిగిన పిచ్చి మొక్కలు, పొదలను గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులు జేసీబీ సహాయంతో విజయవంతంగా తొలగించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కూన భాస్కర్ మాట్లాడుతూ, ప్రజలకు, ఆసుపత్రికి వచ్చే రోగులకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడం గ్రామ పంచాయతీ ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు. ఆరోగ్య కేంద్రం పరిసరాలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షిస్తామని ఆయన తెలిపారు.
ఈ పారిశుధ్య కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇరిగిరాల శ్రావణ్ కుమార్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎండీ. ముస్తఫా, పంచాయతీ కార్యదర్శి బి. ఉదయ్ కుమార్, ప్రజాప్రతినిధులు అంబల్ల సంపత్ రెడ్డి, కే. ప్రశాంత్ రెడ్డి, బిస్కుల రవి మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.












