జైపూర్ (అక్షరవేకువ) జూలై 14
జైపూర్ మండలం వేలాల గ్రామపంచాయతీలోని పోలింగ్ కేంద్రాలను మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఈఓ) కార్యాలయం నుండి వచ్చిన డిప్యూటీ కలెక్టర్ ఎం. జయచంద్ర రెడ్డి, జైపూర్ తహసీల్దార్ వనజ రెడ్డిలు ఆకస్మికంగా సందర్శించారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు కల్పిస్తున్న భౌతిక సౌకర్యాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు.
జైపూర్ మండలం వేలాల గ్రామపంచాయతీలోని పోలింగ్ కేంద్రాలను మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఈఓ) కార్యాలయం నుండి వచ్చిన డిప్యూటీ కలెక్టర్ ఎం. జయచంద్ర రెడ్డి, జైపూర్ తహసీల్దార్ వనజ రెడ్డిలతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు.
రాబోయే ఎన్నికల నేపథ్యంలో వేలాలలోని PS-122, PS-123 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు కల్పిస్తున్న భౌతిక సౌకర్యాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. కేంద్రాలలో తాగునీరు, విద్యుత్, రాంప్ సదుపాయం వంటి కనీస వసతులు ఉన్నాయా లేదా అని నిశితంగా తనిఖీ చేశారు.
అనంతరం ఓటర్ల జాబితాను ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్న తీరును పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా పకడ్బందీగా వ్యవహరించాలని, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో వేలాల గ్రామ సర్పంచ్ స్వప్న నగేష్, బి.ఎల్.ఓ లు విజయలక్ష్మి, నిర్మల, జి.పి.ఓ లు ఉషారాణి, భారతితో పాటు పలువురు రెవెన్యూ, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.











