మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 13
తాడిచర్ల బొగ్గు బ్లాక్ సింగరేణికి కేటాయించిన నేపథ్యంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సోమ, మంగళవారాల్లో సింగరేణి ప్రాంతంలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా, నాలుగు సంవత్సరాలుగా ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న డిస్మిస్ కార్మికులు తమ సమస్యపై మంత్రి దృష్టి సారించాలని కోరుతున్నారు.
సింగరేణి వ్యాప్తంగా విధుల నుంచి తొలగించబడిన (డిస్మిస్) కార్మికులు మరోసారి ఆశతో ఎదురుచూస్తున్నారు. తాడిచర్ల బొగ్గు బ్లాక్ సింగరేణికి కేటాయించిన నేపథ్యంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సోమ, మంగళవారాల్లో సింగరేణి ప్రాంతంలో పర్యటించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో, తమ సమస్యపై దృష్టి సారించాలని డిస్మిస్ కార్మికులు వేడుకుంటున్నారు.
నాలుగేళ్లుగా ఉద్యోగాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కేంద్ర మంత్రి జోక్యంతో తమకు న్యాయం జరుగుతుందనే ఆశాభావంతో ఉన్నామని కార్మికులు తెలిపారు. తమ సమస్యను కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి చొరవ తీసుకోవాలని వారు కోరుతున్నారు.












