మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 13
మంచిర్యాల నియోజకవర్గంలో జరుగుతున్న సర్వే ప్రక్రియకు ప్రజలు తప్పనిసరిగా సహకరించాలని, ఇది ఓటు నమోదుతో సంబంధం లేకుండా ప్రభుత్వ పథకాల అర్హతలకు కీలకమని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే తీవ్రంగా నష్టపోతారని ఆయన హెచ్చరించారు.
మంచిర్యాల నియోజకవర్గంలో జరుగుతున్న సర్వే ప్రక్రియకు ప్రజలు వేగంగా సహకరించాలని, ఇది ఓటు నమోదుతో సంబంధం లేదని, ప్రభుత్వ పథకాల అర్హతలకు ముడిపడి ఉందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని కోల్పోతే బ్రతికుండి మరణించిన వారితో సమానమని హెచ్చరించారు. వెంటనే మేల్కొని నమోదు ప్రక్రియలో పాల్గొనాలని సూచించారు.
ప్రస్తుతం అసెంబ్లీ పరిధిలో 50% సర్వే పూర్తయిందని, ఈనెల 24 చివరి అవకాశమని తెలిపారు. ప్రజలు సహకరించి ప్రభుత్వ అర్హతలు పొందాలని ఎమ్మెల్యే కోరారు. సోమవారం ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు, మేయర్ మధుకర్, సిటీ అధ్యక్షులు తూముల నరేష్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.












