మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 04
మంచిర్యాలలో ర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఐసిడిఎస్ సంయుక్తంగా లైన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో మాతా శిశు కేంద్రంలో మంచితల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అవగాహన పోస్టర్లను ఆవిష్కరించి, గర్భిణీలకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.
మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఐసిడిఎస్ సంయుక్తంగా లైన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో మాతా శిశు కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి () శ్రీ నరేంద్ర రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రత్యేక అతిథులు
ఈ సందర్భంగా సూపర్డెంట్ ఇన్చార్జ్ డాక్టర్ అశోక్ కుమార్, ఆర్ ఎం ఓ డాక్టర్ శ్రీధర్, డిప్యూటీ డి ఎం ఎం హెచ్ ఓ డాక్టర్ సుధాకర్ నాయక్, జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ రావు ఖాన్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు.
అవగాహన కార్యక్రమాలు
వక్తలు తల్లిపాల ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ మరియు వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా రూపొందించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 200 మంది గర్భిణీ స్త్రీలకు పళ్ళు, బ్రెడ్ పంపిణీ చేశారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు లయన్ పి. వెంకటేశ్వర్లు, ప్రోగ్రాం చైర్ పర్సన్ లయన్ వి మధుసూదన్ రెడ్డి, జోన్ చైర్ పర్సన్ లయన్ దొంతుల ముఖేష్, సెక్రటరీ లయన్ తవటం శ్రీనివాస్, ట్రెజరర్ లయన్ పి వెంకటేశ్వరరావు, సీనియర్ లయన్ మెంబర్స్ లయన్ ఎం రామాంజనేయుల, లయన్ డేగ బాబు, లయన్ ఎస్ నాగేందర్ పాల్గొన్నారు.
ఇతర సిబ్బంది
హెల్త్ సూపర్వైజర్లు అల్లాడి శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఐసిడిఎస్ సూపర్వైజర్ జ్యోతి, ఆస్పత్రి సిబ్బంది, గర్భిణీ స్త్రీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.











