మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 11
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మల్లికార్జున పిల్లల ఆసుపత్రిలో జన్మించిన సమయంలో తక్కువ బరువుతో, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న శిశువులకు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. లండన్లో పొందిన శిక్షణ అనుభవంతో, పిల్లల వైద్య నిపుణులు గోపతి శ్రీనివాస్ 600 గ్రాములతో జన్మించిన ఒక కవల శిశువుకు ప్రాణదానం చేశారు. ఈ అరుదైన వైద్యం విలువ సుమారు 20 లక్షలు కాగా, దానిని ఉచితంగా అందజేశారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మల్లికార్జున పిల్లల ఆసుపత్రిలో జన్మించిన సమయంలో తక్కువ బరువుతో, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న శిశువులకు గ్రామంలోనే ప్రత్యేక శ్రద్ధ కనబరిచి, మెరుగైన వైద్యం అందించడం తన లండన్ శిక్షణ అనుభవాన్ని ఎంతగానో ఉపయోగపడుతోందని పిల్లల వైద్య నిపుణులు గోపతి శ్రీనివాస్ అన్నారు. ఈ చికిత్సతో శిశువులు కోలుకునే అవకాశం ఉందని, పుట్టిన పిల్లలపై పెట్టుకున్న ఆశలను చికిత్స ద్వారా మెరుగుదల చూపే అవకాశం ఉందని ఆయన దంపతులకు భరోసా ఇచ్చారు.
దయగం మండలానికి చెందిన రాజేశ్వరి, రాజకుమార్ అనే పేద దంపతులకు 40 రోజుల కిందట కవలలు జన్మించారు. వీరిలో ఒక శిశువు 600 గ్రాముల బరువుతో పుట్టడంతో వెంటనే మల్లికార్జున ఆసుపత్రిలో చేర్పించారు. ఆ శిశువుపై ప్రత్యేక శ్రద్ధతో ఐసీయూ, ఇంకుబేటర్, సీనియర్ కాంపౌండర్ల పర్యవేక్షణలో ప్రత్యేక గదిలో చికిత్స అందించారు. ఈ చికిత్సకు స్పందించి శిశువు బరువు 600 గ్రాముల నుండి 1.1 కిలోలకు పెరిగినట్లు వైద్యులు శ్రీనివాస్ తెలిపారు. ఈ వైద్యం విలువ సుమారు 20 లక్షలు కాగా, దానిని మానవతా దృక్పథంతో ఉచితంగా అందజేశామని డాక్టర్ చెప్పారు.
తమకు లండన్లో తక్కువ బరువుతో జన్మించిన పిల్లలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చికిత్స అందించిన అనుభవంతో, తమ ఆసుపత్రిలోనూ అటువంటి చికిత్సలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. పుట్టినప్పుడు తక్కువ బరువుతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పిల్లలు తమ ఆసుపత్రిని సంప్రదిస్తే, తగిన చికిత్సలతో బరువు పెరిగేలా ప్రత్యేక ట్రీట్మెంట్ ఉంటుందని, ప్రసూతి మహిళలతో పాటు ప్రజలు గమనించాలని డాక్టర్ శ్రీనివాస్ సూచించారు.
ఆధునిక వైద్యం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ తరుణంలో, చికిత్సలలోనూ కొత్త విధానాలను అనుసరిస్తున్నామని, తక్కువ బరువుతో జన్మించిన నవజాత శిశువులకు ప్రత్యేక వైద్య సదుపాయం తమ వద్ద ఉందని డాక్టర్ శ్రీనివాస్ శుక్రవారం మల్లికార్జున పిల్లల ఆసుపత్రిలో మీడియాతో స్పష్టం చేశారు.











