Visakhapatnam/Padmanabham (అక్షరవేకువ) జూలై 22
వర్షాల నేపథ్యంలో డెంగ్యూ, చికెన్ గునియా, డయేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్ ఆదేశించారు. నిర్మల్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో డెంగ్యూ, చికెన్ గునియా, డయేరియా, డీసెంట్రీ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్ ఆదేశించారు.
న నిర్మల్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో సీజనల్ వ్యాధులు, వివిధ ఆరోగ్య కార్యక్రమాల ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజేందర్ మాట్లాడుతూ, ప్రతి శుక్రవారం, మంగళవారం డ్రైడే పాటించాలని, ఫీవర్ సర్వే నిర్వహించాలని, అధికంగా వ్యాధులు ప్రబలిన, అధిక ప్రమాదం గల ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా వివిధ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలు, సాధించిన ప్రగతిని సమీక్షించి, లక్ష్యాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.
ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వహణ అధికారులు డాక్టర్ నయానా రెడ్డి, డాక్టర్ రాజా రమేష్, డాక్టర్ రాకేష్, డాక్టర్ సౌమ్య, డాక్టర్ పవన్ కుమార్, Dy. DM&HO డాక్టర్ ఆకాష్, డిప్యూటీ జిల్లా విస్తరణ మరియు మీడియా అధికారి బారె రవీందర్, జిల్లాలోని వైద్యాధికారులు, ఆరోగ్య పర్యవేక్షకులు పాల్గొన్నారు.












