Mancherial/Jaipur (అక్షరవేకువ) జూలై 29
సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (ఎస్టిపిపి) ప్రాంగణంలోని కేపీసీ లేబర్ కాలనీలో కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసం నూతన వైద్య కేంద్రాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్టిపిపి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) సి.హెచ్. చిరంజీవి, జనరల్ మేనేజర్ (జీఎం) ఎం.నరసింహరావుతో కలిసి రిబ్బన్ కట్ చేసి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.
సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (ఎస్టిపిపి) ప్రాంగణంలోని కేపీసీ లేబర్ కాలనీలో కార్మికుల భద్రత, ఆరోగ్య సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన నూతన వైద్య కేంద్రాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్టిపిపి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) సి.హెచ్. చిరంజీవి, జనరల్ మేనేజర్ (జీఎం) ఎం.నరసింహరావుతో కలసి సాంప్రదాయబద్ధంగా రిబ్బన్ కట్ చేసి నూతన వైద్య కేంద్రాన్ని ప్రారంభించారు.
అనంతరం, నూతన ఆస్పత్రిలోని వైద్య గదిని సందర్శించిన ఈడీ చిరంజీవి అక్కడి వైద్యుల వద్ద స్వయంగా బిపి (రక్తపోటు) పరీక్ష చేయించుకుని, అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. కార్మికులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా తక్షణమే ప్రాథమిక చికిత్స అందించేలా నిరంతరం సేవలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సేఫ్టీ డిస్ప్లే బోర్డు ద్వారా అగ్నిమాపక పరికరాల వినియోగం, ప్రమాదాల నివారణ పద్ధతులపై కార్మికులకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో బీహెచ్ఈఎల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (పిడి) మధు కిరణ్, కేపీసీ ఈడీ సుశీల్ కామశెట్టి, కేపీసీ అధికారులు సోమేశ్వరరావు, మునిశేఖర్ రెడ్డితో పాటు ఇతర సిబ్బంది, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












