ప్రకాశం, 5 October
లండన్ నుంచి చికాగో వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం ఆకాశంలో తీవ్ర అనూహ్య సంఘటనను ఎదుర్కొంది. 37వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా 28వేల అడుగులకు జారి, ఆపై 7వేల అడుగుల ఎత్తుకు చేరుకుంది.
లండన్ నుంచి చికాగో వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం ఆకాశంలో అనూహ్య సంఘటనను ఎదుర్కొంది. 37వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా 28వేల అడుగులకు జారి, ఆపై 7వేల అడుగుల ఎత్తుకు చేరుకుంది.
ఈ పరిణామంతో వెంటనే అప్రమత్తమైన పైలట్లు, అత్యవసర పరిస్థితిని సూచించే యూనివర్సల్ కోడ్ అయిన 7700ను జారీ చేశారు. తక్షణమే విమానాన్ని యూటర్న్ తీసుకొని లండన్ హీత్రూ విమానాశ్రయానికి మళ్లించారు.
ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పైలట్లు సకాలంలో స్పందించి విమానాన్ని సురక్షితంగా దించడంలో కీలక పాత్ర పోషించారు.











