చెన్నూర్, 2 November
చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని పద్మనగర్ గేర్రె కాలనీ అభివృద్ధికి మహర్దశ పట్టనుంది. కాలనీలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా సుమారు రూ.4 కోట్ల నిధులతో నూతన సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైనేజీల నిర్మాణ పనులకు ఈరోజు శ్రీకారం చుట్టారు. చెన్నూరు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక కృషి, చొరవతో ఈ నిధులు మంజూరు కావడంతో కాలనీవాసుల చిరకాల సమస్యలకు పరిష్కారం లభించనుంది.
చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని పద్మనగర్ గేర్రె కాలనీ అభివృద్ధికి మహర్దశ పట్టనుంది. కాలనీలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా సుమారు రూ.4 కోట్ల నిధులతో నూతన సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైనేజీల నిర్మాణ పనులకు ఈరోజు శ్రీకారం చుట్టారు.
చెన్నూరు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక కృషి, చొరవతో ఈ నిధులు మంజూరు కావడంతో కాలనీవాసుల చిరకాల సమస్యలకు పరిష్కారం లభించనుంది. అధ్వానంగా ఉన్న రహదారులు, మురుగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఈ అభివృద్ధి పనులు చేపట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ ప్రజల సమక్షంలో అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ప్రజల అవసరాలను గుర్తించి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులకు ప్రాధాన్యత కల్పించడం మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవకు నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.
కాలనీల అభివృద్ధే లక్ష్యంగా ముందడుగు. రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడితే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యంతో పాటు పారిశుద్ధ్య సమస్యలు కూడా తగ్గుతాయని వారు తెలిపారు.
చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు మంత్రి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
రూ.4 కోట్ల భారీ నిధులతో చేపట్టిన ఈ పనులు పూర్తయితే పద్మనగర్ గేర్రె కాలనీ రూపురేఖలు మారనున్నాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


