ఆదిలాబాద్, 13 October
ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారిపై తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మావలా, ఇచ్చోడా వద్ద వాహన అండర్ పాస్ ల నిర్మాణానికి రూ. 78.42 కోట్లు మంజూరు చేసింది. ఈ విషయాన్ని ఎంపీ గోడం నగేష్ వెల్లడించారు.
జిల్లాలో జాతీయ రహదారిపై తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టిన ప్రయత్నాలు ఫలించాయని ఎంపీ గోడం నగేష్ తెలిపారు. మావలా, ఇచ్చోడా వద్ద వాహన అండర్ పాస్ లు లేకపోవడం వల్ల తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ సమస్యను ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి నితిన్ ఘడ్కరి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో, మావలా, ఇచ్చోడా వద్ద వాహన అండర్ పాస్ ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 78.42 కోట్లు మంజూరు చేసిందని ఎంపీ గోడం నగేష్ వెల్లడించారు. ఈ నిధులతో చేపట్టిన నిర్మాణ పనులు పూర్తయితే ప్రమాదాల నివారణకు దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.












