Delhi, 19 November
ఆటో కార్మికుల హక్కుల సాధన కోసం దేశ రాజధాని ఢిల్లీలో గాజుల ముకేశ్ గౌడ్ గళమెత్తారు. లక్షలాది ఆటో డ్రైవర్ల జీవన భద్రత, సామాజిక సంక్షేమం, ఉపాధి హక్కుల పరిరక్షణ లక్ష్యంగా రామ్లీలా మైదాన్ వేదికగా జరిగిన ఢిల్లీ చలో కార్యక్రమంలో ఆయన కీలక డిమాండ్లను జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు.

రాష్ట్ర హితం పరిశ్రమ హితం కార్మిక హితం అనే నినాదంతో భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ (బీపీటీఎంఎం), భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) అనుబంధ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర జేఏసీ ఆటో చైర్మన్ గాజుల ముకేశ్ గౌడ్ అతిథిగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సభలో వివరించి, వాటి పరిష్కారానికి ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎండనకా, వాననకా రాత్రింబవళ్లు ప్రజలకు రవాణా సేవలు అందిస్తూ లక్షలాది కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తున్న ఆటో డ్రైవర్లకు తగిన గుర్తింపు, భద్రత, సంక్షేమ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసి, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పిల్లల విద్యకు ఆర్థిక సహాయం, వృద్ధాప్య పింఛన్లు అందించాలని కోరారు.
అలాగే, త్రీ వీలర్ ఆటో లైసెన్సుల సమస్యలను పరిష్కరించాలని, అర్హులైన డ్రైవర్లకు వెంటనే లైసెన్సులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
రాపిడో తదితర అగ్రిగేటర్ సేవల విషయంలో రవాణా నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని, చట్టబద్ధంగా ఆటోలు నడిపేలా చూడాలని డిమాండ్ చేశారు.