సదాశివపేట పట్టణంలో వీరభద్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి పులిమామిడి రాజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు.
సదాశివపేట పట్టణంలోని శ్రీ ఈశ్వర్ మందిర్ సమీపంలో వీరభద్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి పులిమామిడి రాజు సందర్శించారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం పులిమామిడి రాజు మాట్లాడుతూ, వినాయక నవరాత్రులలో 12 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజించాలని యువతకు సూచించారు. నిమజ్జనం రోజున వినాయకుడిని వీలైనంత త్వరగా నిమజ్జనానికి తరలించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. నిమజ్జన కార్యక్రమంలో డీజేల వినియోగానికి బదులుగా చిటికెలు, కోలాటం, డప్పులు వంటి సంప్రదాయ కళలను ప్రోత్సహించాలని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో వీరభద్ర యూత్ అసోసియేషన్ సభ్యులు మహేష్ గౌడ్, టి. కార్తీక్, రాజు, ఎం.మహేష్, చందు, తాలెల్మ రాము, బిల్లకంటి శ్రీనివాస్, లోకేష్, శివ, నాగేష్, ఈశ్వర్, సోమ శంకర్ తదితరులు పాల్గొన్నారు.










