మండలం నందికంది గ్రామ సమీపంలో జాతీయ రహదారి65పై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తక్షణ సహాయం అందించారు. గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలిస్తూ వెళ్తున్న ఎస్పీకి ఈ ప్రమాదం గురించి తెలియడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
శుక్రవారం మధ్యాహ్నం సుమారు 1.15 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు ఎస్పీ పరితోష్ పంకజ్, సిబ్బంది, స్థానికుల సహకారంతో ప్రాథమిక సహాయం అందించారు. అనంతరం పోలీసు వాహనం, అంబులెన్స్ ద్వారా వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు.
గాయపడిన వివరాలు
ప్రమాదంలో కంది గ్రామానికి చెందిన శివలీల, ఉత్తర్పల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బి. సంతోష్, బీదర్ జిల్లాకు చెందిన బైక్ రైడర్ ఎన్. అమర్ గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన స్థలానికి అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీ సత్తయ్య గౌడ్, ఇన్స్పెక్టర్ వెంకటేశ్ తదితర పోలీసు అధికారులు, సిబ్బంది చేరుకున్నారు.






