ప్రజావాణి ప్రజల నుంచి అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హత మేరకు వేగంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు సంగీత, పాండు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో జరిగిన ప్రజల వినతులను స్వీకరించారు.
కార్యక్రమానికి హాజరైన అర్జీదారుల సమస్యలను ఆలకిస్తూ, ప్రతి దరఖాస్తును పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్లు ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా ప్రతి ఫిర్యాదుకు సత్వర పరిష్కారం అందించాలని తెలిపారు. ప్రజావాణిలో మొత్తం 79 వినతులు అందినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో సంగారెడ్డి డివిజన్‌కు 20, నారాయణఖేడ్ డివిజన్‌కు 2, జహీరాబాద్ డివిజన్‌కు 2, కలెక్టరేట్‌కు 55 దరఖాస్తులు అందాయి. అందోల్ డివిజన్‌కు ఎలాంటి వినతులు అందలేదని తెలిపారు. ప్రజావాణిలో ప్రధానంగా రెవిన్యూ, హౌసింగ్, పెన్షన్లు, పంచాయతీరాజ్, ఎంప్లాయిమెంట్, ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, మిషన్ భగీరథ గ్రిడ్, యూత్ వెల్ఫేర్, కోపరేటివ్, లేబర్, అగ్రికల్చర్, విద్య, వైద్య ఆరోగ్య శాఖ, డీఆర్ డీఓ, సర్వే ల్యాండ్ రికార్డ్స్, పోలీస్, ట్రైబల్ వెల్ఫేర్, మహిళా, శిశు, వికలాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ఈఈ పీఆర్, ఎక్సైజ్, మున్సిపల్ తదితర శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు, వినతులు అందాయి. ఈ జిల్లా స్థాయి వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ప్రజలు పాల్గొన్నారు.


