సదాశివపేట పట్టణంలోని గురునగర్ కాలనీలో పీఎంఆర్ బాల గణేష్ మండపం ఆధ్వర్యంలో జరిగిన చివరి పూజా కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ తౌటం శివాజి, ఇంజనీర్ రాజేష్, చైర్పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిమజ్జన కార్యక్రమంపై కమిషనర్ కీలక సూచనలు చేశారు.
పీఎంఆర్ బాల గణేష్ మండపం ఆధ్వర్యంలో గురునగర్ కాలనీలో చివరి పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సదాశివపేట మున్సిపల్ కమిషనర్ తౌటం శివాజి, మున్సిపల్ ఇంజనీర్ రాజేష్, మున్సిపల్ చైర్పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పులిమామిడి రాజు దంపతులు, గంట ఈశ్వరమ్మశివన్న దంపతులు కూడా గణేశుని చివరి కలశ పూజలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిగీతాలు ఆలపిస్తూ మంగళహారతులు సమర్పించారు. పురోహితులు శివప్రసాద్ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన మున్సిపల్ కమిషనర్ శివాజి, ఇంజనీర్ రాజేష్, చైర్పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణలను 12వ వార్డు కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు దంపతులు శాలువాలతో సత్కరించారు. వారికి వినాయకుని లడ్డూ ప్రసాదాన్ని అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అతిథులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శివాజి మాట్లాడుతూ, శుక్రవారం 25వ తేదీన నిర్వహించనున్న వినాయక నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి పలు సూచనలు చేశారు. పట్టణంలోని వినాయక మండపాల నిర్వాహకులు తమ విగ్రహాలను గాంధీ చౌక్ వద్దకు తీసుకువచ్చి, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నిమజ్జనానికి తరలించాలని కమిషనర్ సూచించారు. వినాయక నిమజ్జనాన్ని భక్తి శ్రద్దలతో, ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కనిగిరి శంకర్ గౌడ్, బస్వరాజ్, యాదయ్య, అఖిల్, మనోజ్, శ్రీనివాస్, ప్రవీణ్, సాయి, అంజి గౌడ్, నర్సింలు, విష్ణు, అనిల్, గుణాకర్, సోమశంకర్ తదితరులు పాల్గొన్నారు.












