భారత్ స్కౌట్స్ అండ్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు గురువారం సంగారెడ్డి జిల్లా సైన్స్ కేంద్రంలో ఏకగ్రీవంగా జరిగాయి. ఎన్నికల పరిశీలకులుగా స్టేట్ అసిస్టెంట్ సెక్రటరీ జాన్ శామ్యూల్, అసిస్టెంట్ స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ, స్కౌట్స్ అండ్ శిక్షణతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని అన్నారు. గత ఏడాది క్యాంపును విజయవంతంగా నిర్వహించిన బృందాన్ని అభినందించారు. జాన్ శామ్యూల్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 2వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ యూనిట్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరులోగా క్యాంపులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అనంతరం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించగా, జిల్లా అసోసియేషన్ అధ్యక్షులుగా జిల్లా కలెక్టర్, చీఫ్ కమిషనర్‌గా డీఈఓ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, అఖిలేష్ రెడ్డి, జగదీష్, విజయలక్ష్మి, శ్రీనివాస్, వసంతకుమారి ఎన్నికయ్యారు. జిల్లా కమిషనర్లుగా అంజాగౌడ్, ఎలిజబెత్, కార్యదర్శిగా మాధవ రెడ్డి, కోశాధికారిగా జీ.సుందర్ రావు, సంయుక్త కార్యదర్శిగా శోభ, ఆర్గనైజింగ్ కమిషనర్లుగా ఆంజనేయులు, వందన, ట్రైనింగ్ కమిషనర్లుగా చంద్రశేఖర్ గౌడ్, సుజాత, అసిస్టెంట్ స్టేట్ హెడ్‌క్వార్టర్స్ బాధ్యులుగా వీరేశం, స్వప్నశ్రీ ఎన్నికైనట్లు తెలిపారు.












