జిల్లా కేంద్రంలో శుక్రవారం జరగనున్న నిమజ్జన యాత్రను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిర్దేశించిన రూట్ మ్యాప్ ప్రకారమే యాత్ర సాగాలని, ప్రశాంత వాతావరణంలో శోభాయాత్రలు జరగాలని కలెక్టర్ కుమార్ దీపక్, డిసిపి ఏ భాస్కర్ తెలిపారు.
జిల్లా కేంద్రంలో శుక్రవారం నిమజ్జన యాత్రను వైభవంగా నిర్వహించాలని, అధికారులు ఏర్పాటు చేసిన రూట్ మ్యాప్ ప్రకారమే నిమజ్జన యాత్ర సాగాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, డిసిపి ఏ భాస్కర్ తెలిపారు. శోభాయాత్రలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. టూ టౌన్ ప్రాంతం అంతా గోదావరిఖని బ్రిడ్జ్ వద్ద, వన్ టౌన్ రాయపట్నం వైపు వెళ్లాల్సి ఉంటుందని, ప్రజలు ప్రశాంతత మధ్య జరిగే ఈ శాంతియుత శోభాయాత్రను విజయవంతం చేయడానికి అధికారులతో కలిసి కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ భాస్కర్ పిలుపునిచ్చారు.
శుక్రవారం భక్త ఆంజనేయ సాయి మండపాన్ని దర్శించుకున్న అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 55, 56 డివిజన్ల కార్పొరేటర్లు గాండ్ల సత్తమ్మ, నల్ల శంకర్ ముదిరాజ్, రాష్ట్ర కార్యదర్శి దబ్బెట తిరుపతి, మండప నిర్వహణ యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భక్త ఆంజనేయ సాయి మండలి, వానర సేన యూత్ ఆధ్వర్యంలో పంచాల నవీన్, బద్రి మనోజ్, బోజ్జ క్రాంతి, తొగరి శ్రీకాంత్, తొగరి రాజేష్, బోజ్జ శ్రావణ్ తదితరులు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.











