మంచిర్యాల జిల్లా, మండలం, బయ్యారం గ్రామంలో దొంగ కరెంట్ కారణంగా ఒక ఆవు మృతి చెందడంతో పాటు రూ.1,00,000/- ఆస్తి నష్టం జరిగింది. మాజీ సర్పంచ్ అనుచరుడు పొలం సాగుకు అమర్చిన సింగిల్ ఫేస్ లైన్ వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
బయ్యారం గ్రామంలో మాజీ సర్పంచ్ ముఖ్య అనుచరుడు పుప్పాల పోషం తన పొలం సాగుకు అమర్చిన సింగిల్ ఫేస్ దొంగ కరెంట్ లైన్ వల్లే విద్యుత్ షాక్తో ఒక ఆవు మృతి చెందింది. ఈ ప్రమాదంలో ఒక వార్డులోని పలు ఇళ్లలో విద్యుత్ లైట్లు, ఫ్రిజ్లు, మోటార్ స్టార్టర్లు కాలిపోయాయి.
ఈ ఘటనతో గ్రామంలో సుమారు రూ.1,00,000/- నష్టం జరిగినట్లు సమాచారం. ఈ సంఘటనతో గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ప్రమాదంపై బుయ్యారం బిజెపి అధ్యక్షురాలు ముడిమడుగుల లావణ్య స్పందించారు. ప్రజల ప్రాణాలు, పశువుల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించాలని, నష్టపోయిన వారికి తగిన నష్టపరిహారం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు వెంటనే గ్రామానికి వచ్చి, విద్యుత్ సరఫరా వ్యవస్థను పరిశీలించి, లోపాలను సరిచేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.












