జిల్లా కోల్డ్ చైన్ అధికారి శ్రీనివాస్ గౌడ్ నిన్న రాత్రి అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పిగా ఉండటంతో ఆయనను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి, అది సాధారణ నొప్పేనని నిర్ధారించారు.
జిల్లా కోల్డ్ చైన్ అధికారి శ్రీనివాస్ గౌడ్ నిన్న రాత్రి అస్వస్థతకు గురై, ఛాతిలో నొప్పిగా ఉండటంతో రిమ్స్ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు వెంటనే ఈసీజీ చేసి, అది సాధారణ నొప్పేనని నిర్ధారించారు. అసిడిటీ సమస్య కావచ్చని భావించి, ఒక ఇంజక్షన్ ఇచ్చి ఇంటికి పంపించారు. సకాలంలో వైద్యం అందించిన వైద్యులకు శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. దీంతో డీఎంహెచ్ఓ అధికారులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.






