భీమారం, 14 November
మండలం దాంపూర్ లోని జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని, దాంపూర్ పాఠశాలలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు, సర్పంచ్ చేగొండ కొమురయ్య, పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్లు, మహిళలు, లు, యువత పాల్గొన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్పంచ్ చేగొండ కొమురయ్య విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. చదువులో విద్యార్థులు రాణించడానికి అవసరమైన ముఖ్యమైన విషయాలపై ఆయన పలు సూచనలు చేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో పాటు, పాఠ్యాంశాలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పిల్లల దినోత్సవం సందర్భంగా పాఠశాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించినట్లు తెలిసింది.







