మంచిర్యాల జిల్లా (అక్షరవేకువ) జూలై 15
మంచిరయాల జిలలాలి ియజకవరగ పరిధిల గల భీమారం గరామంల పరభుతవం లకషల రూపాయలు ఖరచుపెటటి ిరమించి ూత మైదాం పరసతుతం తాగుబతులకు అడడాగా మారింది సథాికులు ఆరపిసతుారు. యువతకు, వృదధులకు ఉపయగపడాలసి ఈ పరాంగణం అసాంఘిక కారయకలాపాలకు వేదికగా మారుతంది ఆందళ వయకతం చేసతుారు.
మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో గల భీమారం గ్రామంలో నూతనంగా ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించిన మైదానం ప్రస్తుతం తాగుబోతులకు అడ్డాగా మారింది. యువతకు ఉపాధితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ మైదానం, వృద్ధులకు ఉదయం పూట నడకకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు, దీని పక్కనే ప్రభుత్వాసుపత్రి, రైతు వేదిక కూడా ఉన్నాయి.
అయితే, చీకటి పడిన తర్వాత ఈ మైదానం తాగుబోతులకు కేంద్రంగా మారుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం పూట యువతకు ఎంతో ఉపయోగపడే ఈ ప్రాంగణం, రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతోందని విమర్శలు వస్తున్నాయి.












