మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 21
వార్షిక తనిఖీలలో భాగంగా మంచిర్యాల డీసీపీ శ్రీ . భాస్కర్, భీమారం పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, పలు కీలక సూచనలు చేశారు.
వార్షిక తనిఖీలలో భాగంగా మంచిర్యాల డీసీపీ . భాస్కర్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్, జైపూర్ సబ్‌డివిజన్‌కు చెందిన భీమారం పోలీస్ స్టేషన్‌ను ఈరోజు (20-08-2026) సందర్శించి, క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, వివిధ విభాగాల పనితీరు, కీలక రికార్డులు, శాంతిభద్రతల నిర్వహణకు సంబంధించిన ఫైళ్లు, నమోదైన కేసుల దర్యాప్తు పురోగతి, నమోదులను ఆయన పరిశీలించారు.
సిబ్బంది పనితీరుపై సంతృప్తి
స్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణ మరియు సిబ్బంది పనితీరుపై డీసీపీ భాస్కర్ సంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు మరియు సిబ్బందిని అభినందిస్తూ, పలు కీలక సూచనలు చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు మరియు నమోదైన కేసులను అనవసరంగా పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో విచారణ పూర్తి చేసి పరిష్కరించాలని ఆయన సూచించారు.
, దర్యాప్తుపై ఆదేశాలు
లో కేసులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని డీసీపీ ఆదేశించారు. కోర్టులతో సమన్వయంతో పనిచేస్తూ, నమోదైన కేసుల్లో నిందితులకు శిక్షలు పడే విధంగా నాణ్యమైన, సాక్ష్యాధారాలతో కూడిన దర్యాప్తు చేపట్టాలని సూచించారు. బాధితులకు రక్షణ మరియు భద్రత కల్పించడం పోలీసుల ప్రధాన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
ప్రజలకు చేరువగా ఉండాలి
ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, వారి సమస్యలపై వెంటనే స్పందించి, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. పోలీస్ సిబ్బంది పనితీరును అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, వారి వృత్తిపరమైన నైపుణ్యాలను మరింత పెంపొందించి ప్రజలకు సమర్థవంతమైన పోలీసింగ్ అందించాలని తెలిపారు.
నేరాల నివారణపై దృష్టి
నేరాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించి, విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్‌ను బలోపేతం చేస్తూ ప్రజల్లో పోలీసులపై విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా పనిచేయాలని డీసీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో జైపూర్ శ్రీ . వెంకటేశ్వర్, శ్రీ . నవీన్ కుమార్, భీమారం శ్రీ . రాజేందర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.












