సంగారెడ్డి, 2026-08-31
మునిపల్లి మండలం బుదేరాలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి.శైలజను కళాశాల నిర్వహణలో లోపాలు, విద్యార్థినుల పట్ల నిర్లక్ష్య వైఖరి కారణంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.
మునిపల్లి మండలం బుదేరాలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి.శైలజను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కళాశాల నిర్వహణలో లోపాలు, పరిపాలనా వ్యవహారాల్లో నిర్లక్ష్యం, నిర్వహణ సక్రమంగా లేకపోవడం, అలాగే విద్యార్థినుల పట్ల ప్రిన్సిపాల్ వ్యవహరిస్తున్న తీరుపై పలు ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాల మేరకు నియోజకవర్గ ప్రత్యేక అధికారి జగదీష్, మండల ప్రత్యేక అధికారి రామాచారి, జిల్లా కోఆర్డినేటర్ కల్పన బుదేరా కళాశాలను సందర్శించారు. వారు కళాశాల నిర్వహణ, పరిపాలనా అంశాలు, విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలు తదితర అంశాలను పరిశీలించి జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పించారు.
సమర్పించిన నివేదికలో పేర్కొన్న అంశాలను పరిశీలించిన అనంతరం, ప్రిన్సిపాల్ పి.శైలజ నిర్లక్ష్య ధోరణి, కళాశాల నిర్వహణలో లోపాలు, విద్యార్థినుల పట్ల తగిన విధంగా వ్యవహరించకపోవడం వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చర్యలు చేపట్టి, ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్థినులకు మెరుగైన విద్యా వాతావరణం, అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు రెసిడెన్షియల్ కళాశాలల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.












