గుడిహత్నూర్, 11 September
ఆదిలాబాద్ జిల్లా మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ నూతన నియామకాలు జరిగాయి. పలువురు నాయకులకు వివిధ కీలక పదవులు దక్కాయి. ఈ నియామకాలతో మండలంలో పార్టీ కార్యకలాపాలు మరింత ఊపందుకుంటాయని భావిస్తున్నారు.
మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ ఎన్నిక ఆదిలాబాద్ జిల్లా మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ నియామకం జరిగింది మండల ఉపాధ్యక్షులు గా మోహితే మారుతీ, దుబ్బాక నరేష్,ఆడే జైపాల్ స్పోఖ్ పర్సన్,జనరల్ సెక్రటరీ పవార్ రాజు,ఆరిఫ్ ఖాన్, కాగ్నే రాంకిషన్,దేవానంద్ పాటిల్,సెక్రటరీ కంబ్లె శ్యామ్,రాథోడ్ రమేష్,రవీంద్రనాథ్ ముండే,షేక్ రహీం, కుమ్రా బీర్షబ్,మెస్రం జాలెందర్,ఎగ్జికివిటివ్ మెంబర్స్ గెడమ్ సాయి కుమారి,ఖాడే వెంకటి,పెందూర్ నాగేంద్రబాబు,రాథోడ్ గణేష్,దుర్గం మహేందర్, కాతలే మాధవ్,ఊర్వేత రోహిత్ వివిధ హోదాలలో ఎన్నికయ్యారు. తమమీద ఎంతో నమ్మకంతో ఈ హోదాలను కల్పించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్,మాజీ ఎంపీ సోయం బాపూరావు,బోథ్ ఇంచార్జి ఆడే గజేందర్, మండల అధ్యక్షులు తొడసం దవులత్ గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తామని వివిధ హోదాలలో ఎన్నికైన సభ్యులు తెలియజేశారు








