సదాశివపేట, 4 September
మండలం నిజాంపూర్ కాలనీ ప్రాథమిక పాఠశాలకు చెందిన సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) జి.నవనీత జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ గౌరవం దక్కింది.
జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి జి.నవనీత (అక్షర వేకువ): ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలం నిజాంపూర్ కాలనీ ప్రాథమిక పాఠశాలకు చెందిన సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) జి.నవనీత జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు బోధనా విధానాల్లో వినూత్న పద్ధతులను అవలంబిస్తూ పాఠశాల అభివృద్ధికి ఆమె చేసిన కృషిని గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించనున్న కార్యక్రమంలో జి.నవనీతకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందజేయనున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆమెను అభినందించారు.












