హైదరాబాద్, 2026-08-21
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తన స్నేహితులతో కలిసి శుక్రవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తన స్నేహితులతో కలిసి శుక్రవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయన, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో తితిదే అధికారుల సమక్షంలో తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ, తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆధ్యాత్మిక సంతృప్తిని కలిగించిందని తెలిపారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌తో పాటు వెంకట్ యాదవ్, పోలీసు కృష్ణ, సాయి యాదవ్, రామకృష్ణ, సైన్ తదితరులు పాల్గొన్నారు.












