ఖాజీపల్లి (అక్షరవేకువ) ఆగస్టు 04
ఖజీప గపతీో దుణ ోటుేసుకుద. ఇట ుదు ఆడుకుటునన నుగేళ బక సఫూత ణపై అడవ పద దడ ేడతో తీవ గపైద. ొదట పభుతవ ఆసుపతక తన, పసథత వషడతో కీనగకు తు. కుటుబ సభుు ఫసట అధకు స కోుతునను.
భీమవరం మండలం లోని ఖాజీపల్లి గ్రామపంచాయతీలో నాలుగేళ్ల బాలిక స్ఫూర్తి రాణిపై అడవి పంది దాడి చేసింది. ఉదయం 8:30 గంటల సమయంలో ఇంటి ముందు వాకిట్లో ఆడుకుంటున్న స్ఫూర్తి రాణిపై అడవి పంది వచ్చి దాడి చేసి, గుద్దడంతో సుమారు 10 ఫీట్ల దూరం ఎగిరిపడింది. ఈ క్రమంలో అక్కడున్న సిమెంట్ ఇటుకలపై పడటంతో బాలిక తలకు, ఒంటి నిండా తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితికి చేరుకున్న బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో, వెంటనే 108 వాహనంలో మంచిర్యాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో, వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని ప్రతిమ హాస్పిటల్కు తరలించారు. పేద కుటుంబానికి చెందిన బాలికకు ఫారెస్ట్ అధికారులు విచారణ జరిపి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.












