ఖాజీపల్లి (అక్షరవేకువ) ఆగస్టు 04
ఖాజపలలి ామపచాయతలో అడవి పది దాడిలో ాలేళల బాలి సఫూతి ాణి తవా ాయపడిది. ఆదివా ఉదయ ఇటి మద ఆడట సమయలో ఈ ఘట చోటచేసది. పది దాడిలో తల, ఒటి ిడా ాయాలై బాలి మెై వైదయ ోస తలిచా.
ఖాజీపల్లి గ్రామపంచాయతీలో నాలుగేళ్ల బాలికపై అడవి పంది దాడి ఘటన కలకలం రేపింది. గోదరి పురుషోత్తం కుమార్తె స్ఫూర్తి రాణి (4) ఆదివారం ఉదయం సుమారు 8:30 గంటల సమయంలో ఇంటి ముందు వాకిట్లో ఆడుకుంటుండగా, అడవి పంది అక్కడికి వచ్చి పాపపై దాడి చేసింది. పంది గుద్దడంతో పాప సుమారు 10 అడుగుల దూరం ఎగిరి పక్కనే ఉన్న సిమెంట్ ఇటుకలపై పడింది. ఈ ఘటనలో బాలిక తలకు, ఒంటి నిండా తీవ్ర గాయాలై, అధిక రక్తస్రావంతో అపస్మారక స్థితికి చేరుకుంది.
వెంటనే 108 అంబులెన్స్‌లో మంచిర్యాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో, వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని ప్రతిమ హాస్పిటల్‌కు తరలించారు. పేద కుటుంబానికి చెందిన గోదరి పురుషోత్తం కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉంది. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు విచారణ జరిపి, తమ డిపార్టుమెంట్ తరఫున ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.












