మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 09
్యాలజల్లాషత్విాలకలాఠశాలల200దద్యా్థులకుల్్క్లవి్్యాలఆధ్్యల్ల్్లే్లుేశాు.లయ్.ధుూద్ెడ్డ,లయ్కొత్తజయ్కాష్,లయ్దాద్గా్లహకాతఈకా్యక్జగద.
లైన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో, లయన్ వి. మధుసూదన్ రెడ్డి, లయన్ కొత్త జయప్రకాష్, లయన్ దామోదర్ గార్ల సహకారంతో పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో 200 మంది విద్యార్థినులకు మధ్యాహ్న భోజన సమయంలో అవసరమైన స్టీల్ ప్లేట్లను సమకూర్చడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రోగ్రాం చైర్ పర్సన్ లయన్ వి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, లైన్స్ ఆర్గనైజేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న పేద, బలహీన వర్గాల విద్యార్థినులకు ప్రోత్సాహాన్ని అందించాలనే ఉద్దేశంతో వారి అభ్యర్థన మేరకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. వీటితో పాటుగా విద్య, ఆరోగ్యంపై విద్యార్థులకు అవగాహన సదస్సులను కూడా నిర్వహిస్తామని తెలియపరిచారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ (MEO) మేడం మాలతి దేవి పాల్గొని, లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ మంచిర్యాల ఉపాధ్యక్షులు లయన్ వేణుగోపాల్, ప్రోగ్రాం చైర్ పర్సన్ లయన్ వి. మధుసూదన్ రెడ్డి, దాతలు లయన్ కొత్త జయప్రకాష్, లయన్ దామోదర్, జోన్ చైర్ పర్సన్ లయన్ దొంతల ముఖేష్, సీనియర్ లయన్ వి. వినయ్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పద్మావతి, పేరెంట్స్ కమిటీ సభ్యురాలు శ్రీమతి అత్తి సరోజ మరియు అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.












