మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ గురువారం 08వ డివిజన్ అరుణక్క నగర్ లో ఆకస్మికంగా పర్యటించి, స్థానికంగా నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిశీలించారు.
గత 20 ఏళ్లుగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న మెయిన్ డ్రైనేజీలోని పూడిక, చెట్లను జేసీబీ సహాయంతో తొలగించే పనులు చేపట్టారు. రానున్న వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తామని మేయర్ తెలిపారు.
ఈ సమస్యపై శాసనసభ్యులు శ్రీ కొక్కిరాళ ప్రేమ్ సాగర్ రావుతో చర్చించి, అవసరమైన నిధులను మంజూరు చేయిస్తానని మేయర్ హామీ ఇచ్చారు. స్థానికులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
డివిజన్ లోని ఇతర సమస్యల పరిష్కారానికి కూడా తగు చర్యలు తీసుకుంటామని మేయర్ భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో స్థానిక కార్పొరేటర్, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.












