మంచిర్యాల (అక్షరవేకువ) సెప్టెంబర్ 08
జిల్లా కేంద్రానికి చెందిన గాజుల జీవన్ కుమార్, ఉస్మానియా యూనివర్సిటీ 85వ స్నాతకోత్సవంలో సంస్కృతం విభాగంలో పీహెచ్డీ పూర్తి చేసినందుకు డాక్టరేట్ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అరుదైన గౌరవం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఉస్మానియా డాక్టరేట్ పొందిన విద్యార్థి సంస్కృతం పీహెచ్‌డీకి దక్కిన అరుదైన గౌరవం జిల్లా కేంద్రంలోని 56వ డివిజన్ హమాలివాడకు చెందిన గాజుల జీవన్ కుమార్ ప్రముఖ ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ పురస్కారాన్ని సాధించారు. సంస్కృతం విభాగంలో PHD పూర్తి చేస్తున్న జీవన్‌కు మంగళవారం యూనివర్సిటీ 85వ స్నాతకోత్సవాల్లో ప్రొఫెసర్లు పురస్కారాన్ని అందజేశారు. ఈ ఘనత సాధించడం పట్ల గర్వంగా ఉన్నట్లు తెలిపారు. ఎంతో క్రమశిక్షణతో పీహెచ్డ్ పూర్తి చేసానని, తల్లిదండ్రులు, స్నేహితులు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి పేరు రాష్ట్ర దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందేలా చూడాలని మిత్రులు ఆకాంక్షతో అభినందనలు తెలిపారు.












