మంచిర్యాల (అక్షరవేకువ) సెప్టెంబర్ 01
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం దొరగారి పల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు లైన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగ్స్, స్టేషనరీ వస్తువులను అందజేశారు. తరగతి గదిలో ఉపయోగపడే సీలింగ్ ఫ్యాన్లను కూడా పంపిణీ చేశారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం దొరగారి పల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (దత్తత పాఠశాల)లో 40 మంది విద్యార్థినీ విద్యార్థులకు లైన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో అవసరమైన స్కూల్ బ్యాగ్స్, స్టేషనరీ వస్తువులను అందజేశారు. తరగతి గదిలో ఉపయోగపడే సీలింగ్ ఫ్యాన్లను కూడా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాన్ని లైన్స్ క్లబ్ మంచిర్యాల సీనియర్ సభ్యులైన లయన్ డాక్టర్ కె సుగుణాకర్ రెడ్డి, లయన్ ఎస్. దామోదర్ గార్ల సహకారంతో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు లయన్ పి వెంకటేశ్వర్లు, లయన్ వి మధుసూదన్ రెడ్డి, లయన్ పి ప్రభాకర్ రావు, లయన్ డాక్టర్ కే సుగుణాకర్ రెడ్డి, పాఠశాల హెడ్మాస్టర్ దామోదర్, టీచర్ కల్పనతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.












