మహబూబాబాద్, 2026-06-05
తమ హక్కుల కోసం మహబూబాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించిన పాలిటెక్నిక్ విద్యార్థులపై ప్రభుత్వం అమానుషంగా, విచక్షణారహితంగా దాడి చేసిందని బీఆర్ఎస్ పార్టీ కోటపల్లి మండల సోషల్ మీడియా అధ్యక్షులు ఆసంపెల్లి సంపత్ కుమార్ ఆరోపించారు. ఇది ప్రభుత్వ దమనకాండకు నిదర్శనమని ఆయన అన్నారు.

పాలసీపై విమర్శలు
విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు తన వద్దే విద్యాశాఖను ఉంచుకొని, పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను (డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్) పాలసీలో విలీనం చేయడం దారుణమని సంపత్ కుమార్ పేర్కొన్నారు. ఇది పాలిటెక్నిక్ విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
బి.టెక్ అవకాశాలు కోల్పోతారని ఆందోళన
పాలసీ ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థులు బి.టెక్ చదివే అవకాశాన్ని కోల్పోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పాలసీని, దానికి సంబంధించిన . నెం. 97ను రద్దు చేసి, పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వంపై తీవ్ర హెచ్చరిక
ఒకవేళ ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే, కేసీఆర్ గారి నాయకత్వంలో, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, ప్రియతమా నాయకుడు డాక్టర్ బాల్క సుమన్ అన్న గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వంపై ప్రకంపనలు సృష్టిస్తామని సంపత్ కుమార్ హెచ్చరించారు. వద్దు, పాలిటెక్నిక్ ముద్దు అని ఆయన నినదించారు.