మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 02
ఇటిక్యాల గ్రామానికి చెందిన ప్రముఖ కవి, గాయకుడు, నటుడు, రాగావధాని పొనకంటి దక్షిణామూర్తికి సత్కళాభారతి పురస్కారం బహుకరించారు. కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో రంగస్థల నటులు, దర్శకులు, టీవీ, సినీ నటులు గంజి సత్యనారాయణ 77వ జన్మదినం సందర్భంగా నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఈ పురస్కారాన్ని అందజేశారు.
లక్షట్ పేట మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన ప్రముఖ కవి, గాయకుడు, నటుడు, రాగావధాని పొనకంటి దక్షిణామూర్తి కి సత్కళాభారతి పురస్కారం బహుకరించారు. కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో రంగస్థల నటులు, దర్శకులు, టీవీ, సినీ నటులు గంజి సత్యనారాయణ 77వ జన్మదినం సందర్భంగా నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఈ పురస్కారాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి, తెలుగు వర్సిటీ వీసీ కోట్ల హనుమంతరావు, నాటక రచయిత డాక్టర్ పురుషోత్తమాచార్య పాల్గొన్నారు. గంజి సత్యనారాయణ రంగస్థలం, సంగీతం, సాహిత్యం, కళారంగాలకు చేస్తున్న కృషిని వారు కొనియాడారు. దక్షిణామూర్తి ప్రామాణిక పద్యగానం, గంజి సత్యనారాయణచే హరే శ్రీకృష్ణ ఏకపాత్రాభినయం ప్రేక్షకులను అలరించాయి. కిన్నెర కార్యదర్శి రఘురామ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












