సంగారెడ్డి, 14 September
జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో, జిల్లా పోలీసు సాయుధ దళ కార్యాలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన గణనాథునికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ దంపతులు, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథునికి పుష్పాలు, పండ్లు సమర్పించి, ప్రత్యేక హారతిని ఇచ్చారు.
జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు సాయుధ దళ కార్యాలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన గణనాథునికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, దంపతులు మరియు అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథునికి పుష్పాలు, పండ్లు సమర్పించి, ప్రత్యేక హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు శ్రీ గణేశుడు జిల్లా ప్రజలందరికీ, పోలీసు అధికారులు, సిబ్బందికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, వారు చేపట్టే ప్రతి కార్యం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. జిల్లా పోలీసులు నిరంతరం ప్రజల రక్షణ కోసం అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్నారని, వారి కర్తవ్య నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు, విఘ్నాలు ఎదురుకాకుండా ధైర్యం, శక్తి, మానసిక ప్రశాంతత ప్రసాదించాలని గణనాథుని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది కుటుంబాల్లో సుఖ సంతోషాలు, ఆరోగ్యం, శ్రేయస్సు నెలకొనేలా మహాగణపతి ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, పరస్పర సోదరభావం, ఐక్యతతో శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు. ఉత్సవాల ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు ప్రతి ఒక్కరూ పోలీసుశాఖకు సహకరిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ నరేందర్, సంగారెడ్డి డిఎస్పీ సత్యయ్య గౌడ్, ఎస్ బీ ఇన్స్ పెక్టర్ సదా నాగరాజు, డిసిఆర్బి ఇన్స్ పెక్టర్ రమేష్, ఇన్స్ పెక్టర్స్ రామకృష్ణ రెడ్డి, రాము నాయుడు, మహేష్ గౌడ్, నాయిముద్దీన్, సుమన్ కుమార్, ఆర్ఐలు సురేష్ నాయక్, రాజశేఖర్ రెడ్డి, డానియెల్, శ్రీనివాస్ రావ్, పోలీస్ అస్సోసియేషన్ అధ్యక్షుడు జనార్ధన్, ఆర్ఎస్ఐలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









