అమీన్పూర్, 7 September
భవిష్యత్ భారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, వారు దేశ భవిష్యత్ నిర్దేశకులని లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అమీన్పూర్ అధ్యక్షుడు లయన్ కె.సిద్ధిరాములు, రీజియన్ సెక్రటరీ లయన్ మంగళపర్తి వెంకటేశం అన్నారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
భావిభారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులే దేశ భవిష్యత్ నిర్దేశకులని శేరిలింగంపల్లి రీజియన్ సెక్రటరీ లయన్ మంగళపర్తి వెంకటేశం, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అమీన్పూర్ అధ్యక్షుడు లయన్ కె.సిద్ధిరాములు అన్నారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం రాత్రి అమీన్పూర్ బృందావన్ టీచర్స్ కాలనీలోని క్లబ్ హాల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అమీన్పూర్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన 12 మంది ఉత్తమ ఉపాధ్యాయులను చిన్నారుల సాంస్కృతిక నృత్యాల మధ్య ఘనంగా సత్కరించారు. ప్రోగ్రామింగ్ చైర్మన్ లయన్ మంగళపర్తి రామకృష్ణ ప్రసాద్ దాతృత్వంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కో-చైర్మన్ కె.నరేష్కుమార్, ప్రత్యేక అతిథి లయన్ ఈ.వి. రమణ, క్లబ్ బాధ్యులు కె.కరుణాకర్ రెడ్డి, కె.నాగరాజు, బి.కృష్ణాగౌడ్, పి.ఆంజనేయులు, పి.నాగభూషణం, కె.మహేందర్ రెడ్డి, పి.రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.












