హైదరాబాద్, 6 November
ముదిరాజ్ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలన్న మూడు దశాబ్దాల డిమాండ్‌పై ఇప్పటికీ నిర్ణయం తీసుకోకపోవడం జాతిలో అసంతృప్తికి కారణమవుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ముదిరాజ్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
ముదిరాజ్ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలన్న మూడు దశాబ్దాల డిమాండ్‌పై ఇప్పటికీ నిర్ణయం తీసుకోకపోవడం జాతిలో అసంతృప్తికి కారణమవుతోంది.
తెలంగాణ రాబిన్‌హుడ్ పాలమూరు ప్రజావీరుడి 174వ జయంతి వేడుకల్లో రవీంద్రభారతిలో సీఎం రేవంత్‌రెడ్డి ముదిరాజులకు కీలక హామీ ఇచ్చారు. మీటింగ్ తదుపరి క్యాబినెట్లోనే న్యాయపరమైన చిక్కులు తొలగించి, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్, మరో మంత్రి వాకిటి శ్రీహరితో కమిటీ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తామని ప్రకటించారు.
అయితే 32 నెలలు గడుస్తున్నా హామీ అమలుకు నోచుకోలేదు. గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలోనూ ఈ అంశం ప్రస్తావనకు రాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ముదిరాజ్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రంలో సుమారు 40 లక్షల జనాభా, 14 శాతం వాటా కలిగిన ముదిరాజులకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో న్యాయం జరగాలంటే బీసీ-ఏలో చేర్చాలన్నది ప్రధాన డిమాండ్. ముఖ్యంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మంత్రి వాకిటి శ్రీహరి ఈ అంశం సాధనలో చొరవ చూపకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
మరోవైపు జాతి నాయకుల మధ్య ఐక్యత కొరవడటం కూడా ఉద్యమానికి ఆటంకంగా మారుతోంది. ఇకనైనా ముదిరాజ్ సంఘాలన్నీ ఏకమై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని, ఇచ్చిన హామీని అమలు చేసే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని జాతి వర్గాలు కోరుతున్నాయి.











