పెద్దపల్లి, మంచిర్యాల, తెలంగాణ (అక్షరవేకువ) సెప్టెంబర్ 21
మంచిర్యాల ఎంపీ సెగ్మెంట్లో 5 గురు ఎమ్మెల్యేలు ఏకమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన రాజకీయ మార్పుల నేపథ్యంలో వంశీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలనే యోచనతో సీనియర్లు ఒక్కటవుతున్నట్టు సమాచారం.
మంచిర్యాల ఎంపీ సెగ్మెంట్లో 5 గురు ఎమ్మెల్యేలు ఏకమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన రాజకీయ మార్పుల నేపథ్యంలో వంశీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలనే యోచనతో సీనియర్లు ఒక్కటవుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు జన్మదిన వేడుకలకు 5 గురు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. రాష్ట్ర మంత్రి వివేక్‌ను తమ రాజకీయ బలంతో అభిమన్యుడిలా బంధించేలా కార్యాచరణ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ధర్మపురి, రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల్లో ఈ పథకానికి రూపకల్పన జరుగుతున్నట్లు తెలుస్తోంది. బెల్లంపల్లి, చెన్నూరు మినహా మిగతా ఎమ్మెల్యేలు ఏకమైతే, వచ్చే ఎన్నికల్లో పరిస్థితులు తారుమారయ్యేలా పథకం రూపకల్పన జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక గడ్డం ఫ్యామిలీకి కాకుండా, విశాఖ ట్రస్టు సేవలను నమ్ముకున్న అభిమానులకు రాబోయే రోజుల్లో పద్మవ్యూహం ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఈ సవాలును ఎదుర్కోవడానికి వంశీ సిద్ధమా అనే ప్రశ్న మొదలవుతుంది. మంత్రి వివేక్, వంశీ కొత్త దారులను వెతుకుతున్నట్లు కనిపిస్తోంది.
కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారిన రాష్ట్ర రాజకీయాలు, చాప కింద నీరులా సాగుతున్న సీనియర్ల కురువృద్ధుడు భీష్మ ప్రణాళికలో పిఎస్ ఆర్ రాజకీయ చదరంగం ఆసక్తికర పరిణామాలకు రూపం ఇచ్చేలా ఉంది. రణతంత్ర క్రీడకు తెర లేపుతున్న నేతలు కనిపిస్తున్నారు. రాజకీయ చక్రబంధంలో బంధీ అయ్యేది ఎవరన్న మీమాంస మొదలవుతుంది. పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్ కేంద్రంగా కాంగ్రెస్ రాజకీయాలు రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా, సోమవారం జరిగే ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సి ఉంది.












