మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 05
మంచిర్యాలఎమ్మెల్యేపిఎస్ఆర్ అసెంబ్లీ పరిధిలో సాండ్ ల్యాండ్ మైనింగ్ అక్రమాలపై తనపై వస్తున్న ఆరోపణలను మంచిర్యాల ఎమ్మెల్యే పిఎస్ఆర్మూడోకన్నుతెరుస్తాపాశుపతఅస్త్రంసంధిస్తాశత్రుషేశాన్నితుదిముట్టిస్తాకుట్రలనుచేదిస్తాపరువునష్టందావావేస్తాబజార్లోనిలబెడతాప్రజాప్రతినిధులభరతంపడతామండేసూర్యుడిలామంచిర్యాల ఖండించారు. తనకు గిట్టని రాజకీయ పెద్దలు కుట్ర పన్ని ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
మంచిర్యాల అసెంబ్లీ పరిధిలో సాండ్ ల్యాండ్ మైనింగ్ అక్రమాలపై తనపై వస్తున్న ఆరోపణలను మంచిర్యాల ఎమ్మెల్యే పిఎస్ఆర్ ఖండించారు. తనకు గిట్టని రాజకీయ పెద్దలు కుట్ర పన్ని ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బ్యాంకుల ఎంపీ 109 కోట్లు ఉండగా, మొత్తం 195 కోట్లు చెల్లించారనే ఆరోపణలు సత్యదూరమని, 457 కోట్లుగా బీజేపీ ప్రజాప్రతినిధులు చేస్తున్న ఆరోపణలు సిగ్గుచేటని ఆయన అన్నారు.
ప్రజాభిప్రాయంపై సర్వే
నెల రోజుల కిందట జరిగిన సర్వేలో తనకు 77.2 శాతం ప్రజాదరణ ఉందని, దివాకర్ రావు 9.5, రఘునాథ్ 6.0 శాతం, కాంగ్రెస్ 41.4, బీఆర్ఎస్ 17.5, బీజేపీ 10.1 శాతం ప్రజాదరణ ఉందని తెలిపారు. ఎన్నికల క్రమంలో 51.1 శాతం ఉన్న తన ప్రాముఖ్యత ప్రస్తుతం 77.2 శాతానికి పెరిగిందంటే తన మంచి పనులే నిదర్శనమని సర్వే చెబుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
తీవ్ర హెచ్చరికలు
తనపై కుట్రలు చేసేవారిపై మూడో కన్ను తెరిచి పాశుపత అస్త్రం సంధిస్తానని, శత్రువులను తుదముట్టిస్తానని, కుట్రలను ఛేదిస్తానని ఎమ్మెల్యే హెచ్చరించారు. పరువు నష్టం దావా వేసి, బజార్లో నిలబెడతానని, ప్రజా ప్రతినిధుల భరతం పడతానని ఆయన తీవ్రంగా స్పందించారు.












