మంచిర్యాల్ (అక్షరవేకువ) ఆగస్టు 02
రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల్ నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో, ఎన్నికల అంచనాలు కూడా పెరుగుతున్నాయి. నియోజకవర్గంలో త్రిముఖఖ పోరు నెలకొనే అవకాశం ఉందని, విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల్ నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో, ఎన్నికల అంచనాలు కూడా పెరుగుతున్నాయి. నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొనే అవకాశం ఉందని, విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.
ఓటర్ల తీర్పు కీలకం
మంచిర్యాల్ అసెంబ్లీ సెగ్మెంట్లో మొత్తం 2,45,000 ఓట్లు ఉన్నాయి. లక్షకు పైగా ఓట్లు సాధించిన అభ్యర్థి విజయం సాధిస్తారని అంచనా వేస్తున్నారు. అయితే, నియోజకవర్గంలో 70 ఉన్న బీసీలు కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిలో మున్నూరు కాపు, ముదిరాజు వర్గాలు ప్రధాన భూమిక పోషించనున్నాయి. ఎస్సీ, ఎస్టీలు కూడా అదే స్థాయిలో తమ పాత్రను పోషించనున్నారు.
ప్రధాన పార్టీల అభ్యర్థులు
ప్రస్తుత రాజకీయ పరిణామాల ప్రకారం, బిజెపి నుంచి రఘునాథరావు, బిఆర్ఎస్ నుంచి విజిత్ రావు, కాంగ్రెస్ నుంచి ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు మారనున్నట్లు కనిపిస్తోంది.











