మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 22
ప్రజాస్వామ్యంపై గౌరవం లేని రాహుల్ గాంధీ, ఎంపీ వంశీ తీరును బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరీ వెంకటేశ్వర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్లో నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ పై చర్చకు ప్రభుత్వం సిద్ధమని చెప్పినా, ప్రధాని నివాసం ముందు ధర్నా చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన విమర్శించారు. ఈ నిరసనలో భాగంగా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ చిత్రపటాన్ని దహనం చేశారు.
ప్రజాస్వామ్యంపై గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ వంశీ తీరును బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరీ వెంకటేశ్వర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్లో నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ విషయంలో చర్చకు ప్రభుత్వం సిద్ధమని ప్రకటించినప్పటికీ, అత్యంత సురక్షిత ప్రాంతమైన ప్రధాని నివాసం ముందు ధర్నా చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆయన అన్నారు.
నిన్న ప్రధాని నివాస గృహం ముందు ధర్నా చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినందుకు నిరసనగా, నేడు మంచిర్యాల ఐబీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ చిత్రపటాన్ని దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యయుతంగా హైదరాబాద్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు, రాష్ట్ర నాయకులను అరెస్టు చేయడం ఈ ప్రభుత్వం యొక్క అణచివేత విధానానికి నిదర్శనమని అన్నారు.
పార్లమెంట్ సభ్యులు వంశీ, దేశ ప్రధానిని విధ్వంసం సృష్టించే వ్యక్తిగా చిత్రీకరించడం, పిరికి వ్యక్తి అని సంబోధించడం, నీట్ పేపర్లు అమ్ముకున్నాడని మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ప్రధానిని విధ్వంసం సృష్టించే వ్యక్తిగా చిత్రీకరించడం వంశీ రాజకీయ పరిణితి లేమిని తెలియజేస్తుందన్నారు. గతంలో మీ నాయన ఐదు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు మోడీ విధ్వంసం మీకు కనబడలేదా అని ఆయన ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అమ్మిరిశెట్టి రాజ్‌కుమార్, పెద్దపల్లి పురుషోత్తం, ఆంజనేయులు, పట్టి వెంకటకృష్ణ, పచ్చ స్వప్న రాణి, మోతే సుజాత, ప్రేమ్ సింగ్, పానుగంటి మధు, వైద్య శ్రీధర్, మేరడగొండ శ్రీనివాస్, బొట్ల సత్యం, శతరుణ్ సింగ్, బుద్ధారపు రాజమౌళి, గుండా రాజబాబు, రాకేష్ రేణు, గందె శ్రీనివాస్, ముల్కళ్ళ కుమార్, ఇప్ప సురేష్, ఆడపు కుమారస్వామి మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.











