పట్టణంలో మంగళవారం మాజీ డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ స్టేడియంలో జరిగిన నేషనల్ అథ్లెటిక్స్ స్పోర్ట్స్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను అభినందించారు. ప్రైడ్ హాస్పిటల్లో నూతన వైద్య పరికరాలను కూడా ఆమె ప్రారంభించారు.
అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన నేషనల్ అథ్లెటిక్స్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను అభినందించారు. జాతీయ స్థాయి ఇంటర్ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ మీట్‌కు జిల్లా నుంచి ఎంపికైన క్రీడాకారుల ఎంపిక ప్రక్రియను ఆమె పరిశీలించారు. జిల్లాలోని వోక్సెన్‌లో 16వ తేదీన జరగనున్న పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజేతలకు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ పతకాలను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సోహైల్ అలీ, కార్యదర్శి జావిద్ అలీ, రవి, పీఈటీలు, పీడీలు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం పట్టణంలోని ప్రైడ్ హాస్పిటల్లో నూతన వైద్య పరికరాలను నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు ఉపయోగపడే మెకానికల్ సీపీఆర్ () పరికరాన్ని ఆమె ప్రారంభించారు. అలాగే గుండెలోని రక్తనాళాల్లో వాల్వ్ బ్లాకేజీ పరిమాణాన్ని గుర్తించేందుకు ఉపయోగపడే ఆధునిక వైద్య పరికరాన్ని కూడా ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జార్జ్ మాథ్యూస్, డాక్టర్ అనిల్, నాయకులు ప్రవీణ్, కూన వేణు తదితరులు పాల్గొన్నారు.












