మంచేరియల్, 6 November
మంచిర్యాల నగరపాలక సంస్థలో పనిచేస్తున్న 138 మంది ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈపీఎఫ్, ఈఎస్ఐ బకాయిలను అధికారులు ఎట్టకేలకు చెల్లించారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చొరవతో రూ.3.42 కోట్లను కార్మికుల ఖాతాల్లో జమ చేశారు. దీంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మంచిర్యాల నగరపాలక సంస్థలో పనిచేస్తున్న 138 మంది ఔట్సోర్సింగ్ కార్మికులకు ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈపీఎఫ్, ఈఎస్ఐ బకాయిలను అధికారులు ఎట్టకేలకు చెల్లించారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు చొరవతో రూ.3.42 కోట్లను కార్మికుల ఖాతాల్లో జమ చేశారు. దీంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భవిష్యత్తుకు భరోసా కల్పించేలా చర్యలు తీసుకున్న ఎమ్మెల్యేకు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు సుదమల్ల హరికృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై బకాయిలు లేకుండా ప్రతినెలా చెల్లింపులు చేయాలని అధికారులను కోరారు. ఎమ్మెల్యే సహకారంతో మరిన్ని కార్యక్రమాలు కార్మికుల అభ్యున్నతి సాధికారత దిశగా ముందుకు సాగుతావని ఈ నిధుల విడుదలకు కృషిచేసిన ఎమ్మెల్యే పి ఎస్ ఆర్ తో పాటు మేయర్ మధుకర్ కు ధన్యవాదాలు హరికృష్ణ తెలిపారు












