గుడిహత్నూర్, 26 October
ఆదిలాబాద్ జిల్లా మండల కేంద్రంలో గిరిజన నాయకుడు కొమురం భీమ్ 86వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.
ఆదిలాబాద్ జిల్లా మండల కేంద్రంలో కొమురం భీమ్ 86వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆడే శిలా, ఎస్ఐ ఇమ్రాన్, ఏఎస్ఐ దిలీప్, తొడసం దౌలత్ రావు, లక్ష్మిమన్, అంకతి రవి నాగనాథ్, అప్పా ససానే మాధవ్ పాల్గొన్నారు. కొమురం భీమ్ గిరిజన హక్కుల కోసం పోరాడిన వీరుడని పలువురు వక్తలు కొనియాడారు.









